పార్లమెంట్‌లో తెలంగాణ నేతలు మాట్లాడిన మాటలు తాను విన్నానన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆమె పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు.

అనంతరం నిర్మల మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గివెన్ అన్న పదం వాడారని.. ఆ పదానికి పార్లమెంట్‌లో అనుమతి ఉందని ఆమె గుర్తుచేశారు. ఒకవేళ ఆ పదంపై అభ్యంతరం ఉంటే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయవచ్చునని సీతారామన్ స్పష్టం చేశారు.

Also Read:ఆ విషయంలో మోడీకి మద్దతిచ్చి తప్పు చేశాం: కేటీఆర్ సంచలనం

కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు తగ్గలేదని.. ఏ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసే ఉద్దేశ్యం ఉండదన్నారు. గివెన్ అన్న పదాన్ని మంత్రి కేటీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రానికి మంచి కాంట్రిబ్యూషన్ ఉందన్న ఆమె.. రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదన్నది అవాస్తవమన్నారు.

ఈసారి 2 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి కాబట్టే 42 నుంచి ఒక శాతం తగ్గించి 41 శాతం నిధులు కేటాయించామని నిర్మల పేర్కొన్నారు. అదనంగా ఒక శాతాన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించామని ఆమె గుర్తుచేశారు.

Also Read:టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ కే ట్రబుల్: అక్కడికే హరీష్ రావు పరిమితం

సెస్ కలెక్షన్ తక్కువ కావడం వల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్‌టీ ఇవ్వలేకపోయామని నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా జీఎస్టీ నిధులు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

త్వరలోనే ఈ నిధులు విడుదల చేస్తామని.. సెస్ వచ్చే కొద్దీ ఇస్తూనే ఉంటామని నిర్మల స్పష్టం చేశారు. తెలంగాణకి రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న మాట అవాస్తవమని నిర్మలా సీతారామన్ చెప్పారు.