మద్యం తాగించి ఉగండా యువతిపై ఇద్దరు అత్యాచారం

Uganda woman raped in Hyderabad by sudan men
Highlights

ఉగండాకు చెందిన యువతిపై సూడాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు.

హైదరాబాద్: ఉగండాకు చెందిన యువతిపై సూడాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఉగండా యువతిని వారిద్దరు హైదరాబాద్ రప్పించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

దాంతో పోలీసులు మహ్మద్ ఫాజిర్, అమర్ హసన్ లను అరెస్టు చేశారు 21 ఏళ్ల వయస్సు గల ఉగండా యువతి పూణేలో ఉద్యోగం చేస్తూ సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది. రెండేళ్ల క్రితం దక్షిణ భారత పర్యటన సమయంలో హైదరాబాదులో ఉంటున్న మహ్మద్ ఫాజిర్ అనే సూడాన్ యువకుడు పరిచయమయ్యాడు. తర్వాత ఆమె వివరాలను ఫేస్ బుక్ లో చూసి దాని ద్వారా పరిచయం పెంచుకున్నాడు.

ఇద్దరు తరుచుగా చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. అతను కోరడంతో ఆణె నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఇద్దరు కలిసి మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత వెళ్లిపోయింది. మరోసారి రావాలంటూ అతను అడగడంతో ఏప్రిల్ 28వ తేదీన మళ్లీ హైదరాబాద్ వచ్చింది. 

ఈసారి అతను ఆమెను తన ఫ్లాట్ కు తీసుకుని వెళ్లాడు. అక్కడికి వచ్చిన తర్వాత అమర్ హసన్ అనే యువకుడ్ని పరిచయం చేశాడు. ముగ్గురు కలిసి నాలుగు రోజుల పాటు హైదరాబాదులో తిరిగారు. గురువారం రాత్రి ఫ్లాట్ కు వస్తూ మద్యం తెచ్చుకున్నారు. ఆమెతో కూడా మద్యం తాగించారు. 

ఆమె మత్తులోకి జారిపోయిన తర్వాత ఫాజిర్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే, కొట్టి బలవంతంగా ఆమెపై ఇద్దరు కలిసి అత్యాచారం చేశారు. శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఇద్దరు నిందితులు హైదరాబాదు శివారులోని వేర్వేరు విద్యాసంస్థల్లో చదువుతున్నారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సూడాన్ రాయబార కార్యాలయానికి పోలీసులు సమాచారం అందించారు. 

loader