హైదరాబాద్ నగరంలో హైటెక్ వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉగండాకు చెందిన ఐదుగురు మహిళలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. లొకాంటో వెబ్ సైట్ ద్వారా వీరంతా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. వెబ్ సైట్ లో వ్యభిచార నిర్వాహకురాలుని మానవ అక్రమ రవాణా నిరోధక బృందం పోలీసులు చాలా చాకచక్యంగా సంప్రదించారు.

కాగా... సదరు మహిళ దిల్ సుఖ్ నగర్ లోని లాడ్జికి రావాలని సూచించింది. పోలీసులు సాధారణ దుస్తుల్లో ఆ లాడ్జికి చేరుకున్నారు. కారులో వచ్చిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ఇద్దరు నిర్వాహకులను పట్టుకున్నారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి 5 గ్రాముల బంగారం, 22 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 

నిందితులంతా పర్యాటక వీసాపై ఉగాండా నుంచి వచ్చి హైదరాబాద్, ముంబయి లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. వీరి వీసా గడుపు ఇప్పటికే పూర్తయ్యిందని నిర్థారించారు.