ఒంటరి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. పదే పదే అదే రిపీట్ చేశారు. దీంతో వారం క్రితం బాలిక కడుపునొప్పితో బాధపడుతూ విషయం తల్లికి చెప్పింది.

మహబూబ్నగర్ : Mahabubnagarలోని కోయిలకొండలో ఒక బాలికను లోబరుచుకుని ఇద్దరు యువకులు molestationకి పాల్పడడంతో గర్భవతి అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం లోని ఒక గ్రామానికి చెందిన 13 year old girlపై కొన్ని నెలల క్రితం కోయిలకొండ కు చెందిన గొల్ల రవి కుమార్, గడ్డం శ్రీకాంత్ సమీపంలోని పిండిగిర్నిలో అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తరువాత కూడా బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు లైంగిక దాడికి దిగారు. వారం రోజుల క్రితం బాలిగా కడుపు నొప్పితో బాధపడుతూ తల్లికి విషయం చెప్పింది. కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భిణి అని తేలింది. దీంతో తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై శీనయ్య పోక్సో, ఎస్సీ, ఎస్టి, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 

కాగా, నిజామాబాద్ లోనూ ఇలాంటి దారుణ ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాగుడు మూతల పేరుతో బాలికకు దగ్గరైన ఓ యువకుడు ఆమె Nude pictures సేకరించి, తరువాత వాటిని చూపించి బెదిరిస్తూ Sexual assaultని కొనసాగించాడు. Instagram లో ఇటీవల పరిచయమైన ఇంకొకడు అదే బాలికపై molestationకి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను ఫోన్లో బంధించి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. వేధింపులు తాళలేక బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో nizamabad జిల్లాలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.

ఏసీపీ వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. నిజామాబాద్ నాలుగో ఠాణా పరిధిలోని ఓ అపార్టుమెంటులో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ యువకుడు రోహిత్ 2017 నుంచి బాలికతో చనువు పెంచుకుంటూ వస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దాగుడు మూతలు ఆట పేరుతో అపార్ట్మెంట్ పై అంతస్తుకు తీసుకెళ్ళేవాడు. ఈ క్రమంలో మూడేళ్లక్రితం బాలిక నగ్న చిత్రాలను ఫోన్లో బంధించాడు. వాటిని చూపించి, బెదిరిస్తూ, లైంగికదాడి చేశాడు. రెండేళ్ల క్రితం కూడా అవే చిత్రాలు చూపించి ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఏడాది ఏప్రిల్లోను బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించి మరోసారి అత్యాచారం చేశాడు.

ప్రేమ పేరుతో వలవిసిరి..
బాలికకు ఇటీవల భాను ప్రసాద్ గౌడ్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. అతను ప్రేమ పేరిట బాలికను లొంగదీసుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఓ కళ్యాణమండపం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సంబంధిత నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. వాటిని ఆమెకి పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనతో పాటు బయటికి రావాలంటూ భయపెట్టడం ప్రారంభించాడు. తన సోదరి వివాహం నిశ్చయమైన నేపథ్యంలో విషయం బయటికి పొక్కితే.. పరువు పోతుందనే భయంతో.. కొంతకాలంగా ఇద్దరి వేధింపులు భరిస్తూ వచ్చిన బాలిక చివరకు తల్లిదండ్రుల దృష్టికి విషయాన్ని తీసుకు వెళ్ళింది.

సోమవారం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు ఇద్దరిపై అత్యాచారం, pocso, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని.. వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏసిపి మంగళవారం వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన రోహిత్ ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడని, భాను ప్రసాద్ గల్ఫ్ కు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు అని తెలిపారు.