ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడ దెబ్బకు ఇద్దరు మరణించారు. మరణించిన వారిలో ఓ రైతు, టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఉన్నారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని కూడా అధికారులు సూచించారు. 

ఆదిలాబాద్: Telangana రాష్ట్రంలోని ఉమ్మడి Adilabad జిల్లాలో రికార్డు స్థాయిలో Temperatureనమోదయ్యాయి. వడదెబ్బకు ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు మరణించారు. మరో వైపు తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగటున 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలో పొలం పనులు చేస్తూ వడ దెబ్బతో రైతు చనిపోయాడు.జైనథ్ కు చెందిన విఠల్ తన పొలంలో పనులు చేస్తూ వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. మరో వైపు ఇదే జిల్లాలోని తిర్యానీ మండలం వడదెబ్బ తగిలి ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ సంపత్ మరణించాడు. బెల్లంపల్లికి చెందిన సంపత్ వడదెబ్బకు గురై మరణించాడు. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం నాడు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చేప్రాల్ లో చేప్రాల్ లో 48.83 డిగ్రీలు,జైనథ్ లో 43,6, కెరిమెరిలో 43.8 కౌటాలలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు కూడా వీస్తున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కోరారు. అవసరం ఉంటే తప్ప మఁధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని కూడా సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1,2 తేదీల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్,ఆసిఫాబాద్ కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో వైద్య, ఆరోగ్య శాఖాధికారులు కూడా అలెర్ట్ గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూచించారు