దాగుడు మూతల పేరుతో ఒకడు, ఇన్ స్టాలో పరిచయమై ఇంకొకడు.. ఓ బాలికపై యేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. వారి బెదిరింపులకు తీవ్రంగా భయపడిన ఆమె చివరికి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

నిజామాబాద్ : దాగుడు మూతల పేరుతో బాలికకు దగ్గరైన ఓ యువకుడు ఆమె Nude pictures సేకరించి, తరువాత వాటిని చూపించి బెదిరిస్తూ Sexual assaultని కొనసాగించాడు. Instagram లో ఇటీవల పరిచయమైన ఇంకొకడు అదే బాలికపై molestationకి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను ఫోన్లో బంధించి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. వేధింపులు తాళలేక బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో nizamabad జిల్లాలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.

ఏసీపీ వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. నిజామాబాద్ నాలుగో ఠాణా పరిధిలోని ఓ అపార్టుమెంటులో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ యువకుడు రోహిత్ 2017 నుంచి బాలికతో చనువు పెంచుకుంటూ వస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దాగుడు మూతలు ఆట పేరుతో అపార్ట్మెంట్ పై అంతస్తుకు తీసుకెళ్ళేవాడు. ఈ క్రమంలో మూడేళ్లక్రితం బాలిక నగ్న చిత్రాలను ఫోన్లో బంధించాడు. వాటిని చూపించి, బెదిరిస్తూ, లైంగికదాడి చేశాడు. రెండేళ్ల క్రితం కూడా అవే చిత్రాలు చూపించి ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఏడాది ఏప్రిల్లోను బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించి మరోసారి అత్యాచారం చేశాడు.

ప్రేమ పేరుతో వలవిసిరి..
బాలికకు ఇటీవల భాను ప్రసాద్ గౌడ్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. అతను ప్రేమ పేరిట బాలికను లొంగదీసుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఓ కళ్యాణమండపం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సంబంధిత నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. వాటిని ఆమెకి పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనతో పాటు బయటికి రావాలంటూ భయపెట్టడం ప్రారంభించాడు. తన సోదరి వివాహం నిశ్చయమైన నేపథ్యంలో విషయం బయటికి పొక్కితే.. పరువు పోతుందనే భయంతో.. కొంతకాలంగా ఇద్దరి వేధింపులు భరిస్తూ వచ్చిన బాలిక చివరకు తల్లిదండ్రుల దృష్టికి విషయాన్ని తీసుకు వెళ్ళింది.

సోమవారం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు ఇద్దరిపై అత్యాచారం, pocso, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని.. వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏసిపి మంగళవారం వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన రోహిత్ ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడని, భాను ప్రసాద్ గల్ఫ్ కు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు అని తెలిపారు. 

కాగా, కన్నకూతురిమీదే, వావి వరసలు మరిచి అభం, శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై molestationకి పాల్పడ్డాడు ఓ తండ్రి. అత్యంత దారుణమైన ఈ ఘటన uttarpradeshలోని కన్నౌజ్ లో గురుసహాయ్ గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి బాలిక తన అత్త వద్ద నిద్రపోతుండగా.. నిందితుడు ఆమెను బలవంతంగా వేరే గదిలోకి ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక ఏడుపులు విన్న ఆమె అత్త కేకలు వేయడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు గురు సహాయ్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. పదేళ్ల క్రితమే బాలిక తల్లి చనిపోగా, అప్పటి నుంచి అదృశ్యమైన నిందితుడు నాలుగైదు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు.