Asianet News TeluguAsianet News Telugu

మున్సిపల్ ఫలితాలు: ఎవరికి అందనంత ఎత్తులో.. టీఆరెస్ రికార్డ్

మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు టీఆరెస్ క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకుంది. దేశంలో ఎవరు అందుకోని విజయాన్ని అందుకున్న తెరాస పార్టీ ముందస్తు ఎన్నికలకు పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. స్థానికంగా కేసీఆర్ టీమ్ ఏ స్థాయిలో శక్తిని కూడగట్టుకుంటుందో ఈ ఎలక్షన్స్ తో మరో క్లారిటీ వచ్చేసింది. 

trs party biggest record in muncipal elections
Author
Hyderabad, First Published Jan 25, 2020, 5:25 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు టీఆరెస్ క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకుంది. దేశంలో ఎవరు అందుకోని విజయాన్ని అందుకున్న తెరాస పార్టీ ముందస్తు ఎన్నికలకు పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. స్థానికంగా కేసీఆర్ టీమ్ ఏ స్థాయిలో శక్తిని కూడగట్టుకుంటుందో ఈ ఎలక్షన్స్ తో మరో క్లారిటీ వచ్చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పక్షమే విజయాన్ని అందుకుంటుందని ముందే ఉహించినప్పటికే ఆ విజయం ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు గ్రహించలేదు.

trs party biggest record in muncipal elections

120 మునిసిపాలిటీల్లో దాదాపు 109 మునిసిపాలిటీలను టీఆర్ఎస్ దక్కించుకుంది. ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగాను సరైన పోటీని ఇవ్వలేక చతికల పడ్డాయి. అంటే 91 శాతం మునిసిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఒక రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటె దేశంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో 90కి మించి సీట్లను అందుకోలేదు.

trs party biggest record in muncipal elections

కానీ టీఆరెస్ మొదటి సారి ఆ రికార్డును అందుకొని మరోసారి తన బలమెంతో బయటపెట్టింది. కరీంనగర్ ఎన్నికలు మినహాయిస్తే..  తొమ్మిది కార్పొరేషన్లకు గాను ఏడింటిని టీఆరెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఒక అరుదైన ఘనత అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫైట్ లో ప్రతిపక్షాలు ఎంతో కొంత టీఆరెస్ ని దెబ్బ కొడుతుందని అంతా భావించారు. కానీ ఎలక్షన్స్ ప్రచారంలో వారి విమర్శలు ఏ మాత్రం ఫలించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios