తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సంజయ్ మాటలను ప్రజలు విశ్వసించరని.. బూతులు మాట్లాడేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పల్లా స్పష్టం చేశారు.

మీలాగా బూతులు తిడితే జడివానలో కొట్టుకుపోతారని రాజేశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అనేక ఉద్యోగాలు కల్పించిందని.. రాష్ట్రంలో లక్షా 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారని పల్లా గుర్తుచేశారు.

రాష్ట్రంలో 2 లక్షల మంది ఐటీ ఉద్యోగాల్లో చేరారని ఆయన తెలిపారు. భారత దేశంలో కేంద్రం, ఇతర రాష్ట్రాలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేసింది అని చెప్పిన ఆయన మీకు దమ్ముంటే  నీతి ఉంటే నేను చెప్పిన ఉద్యోగాల కల్పన లెక్కలు తప్పు అని నిరూపించు అంటూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు.