Asianet News TeluguAsianet News Telugu

భూ ఆక్రమణ.. ఇదేంటని ప్రశ్నించినందుకు సొంతపార్టీ సర్పంచ్‌పై రసమయి బూతులు, ఆడియో వైరల్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. స్వయంగా సొంత పార్టీ సర్పంచ్‌పైనే రసమయి బాలకిషన్ బూతు పురాణం వైరల్ అవుతోంది

TRS MLA Rasamayi Balakishan Audio Leak
Author
Karimnagar, First Published Sep 5, 2021, 5:51 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. స్వయంగా సొంత పార్టీ సర్పంచ్‌పైనే రసమయి బాలకిషన్ బూతు పురాణం వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని కరీంపేట సర్పంచి మల్లయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణ ఆడియోను విడుదల చేశారు సర్పంచి మల్లయ్య. తనకు మద్ధతుగా వచ్చిన తిమ్మాపూర్ మండలం మొగలిపాలెం మాజీ సర్పంచిపై పోలీసులతో దాడి చేయించారని మల్లయ్య ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకిషన్ దౌర్జన్యాలు, వేధింపులు భరించలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios