హైదరాబాద్ :మున్సిపల్ ఎన్నికలు విపక్ష పార్టీలకు కొత్త టెన్షన్ పెడుతున్నాయి. శనివారం కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో విపక్ష పార్టీలకు వచ్చే స్థానాలపై లెక్కలు వేసుకునే పనిలో పడ్డాయి.

Also read:మున్సిపాలిటీల్లో పాగాకు పావులు కదుపుతున్న టీఆర్ఎస్

అధికార పార్టీకి కొన్ని చోట్ల గట్టిగా పోటీ ఇచ్చామని చెబుతున్నా రేపటి ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది.అధికార పార్టీ మాత్రం వందకు పైగా స్థానాల్లో పాగా వేస్తాం అని ధీమాగా ఉంది. విపక్ష పార్టీలు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ముందు నుంచి కూడా ఆత్మ రక్షణగానే వ్యవరించాయి. అన్ని స్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టే లేకపోయాయి.

 కాంగ్రెస్ పార్టీకి దాదాపు 600 బిజెపికి 400 చోట్ల అభ్యర్థులు రంగంలో దించలేక పోయాయి. ఈ ఎన్నికల్లో వచ్చే  ఓట్ల శాతం రాబోయే భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న  అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విపక్షాలు టిఆర్ఎస్ పార్టీని సగభాగానికి పరిమితం చేసాయి.

అనంతరం జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా విపక్ష పార్టీలు చతికిల బడ్డాయి. అధికార పార్టీ అన్ని జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ బి.జె.పి లు తమ ప్రభావాన్ని పెద్దగా చూపలేకపోయాయి.  

తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలకు వచ్చే ఓట్ల శాతం రాబోయే నాలుగేళ్ల పై ప్రభావితం చేస్తుందని విపక్ష నేతలు అంచనా వేస్తున్నారు. 

కాంగ్రెస్, బిజెపి పార్టీలు చెబుతున్నట్లు గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది లేని పక్షంలో అధికార పార్టీతో డీకొట్టడం విపక్ష పార్టీ నేతలు ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

 మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కి దాదాపు వంద చోట్ల ఎమ్మెల్యేలు  అన్ని తామే అయి పావులు కదిపారు. విపక్ష పార్టీలకు ఏడుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న మునిసిపాలిటీల వరకు ఎంపీలు సహాయ సహకారాలు అందించారు.

అయినా పార్టీల అభ్యర్థులకు పూర్తి స్థాయి లో  సహాయ,సహకారాలు లేకపోవడంతో అధికార పార్టీ అభ్యర్థులతో పోటీ పడలేదని తెలుస్తోంది. రేపటి ఫలితాలు విపక్ష పార్టీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడమా.... ఆత్మరక్షణలో వేయడమా అన్న అంశాలపై స్పష్టత ఇవ్వనున్నాయి