త్వరలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడడంతో అధికార పార్టీలో ఆ రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయో అన్న చర్చ మొదలయింది. పెద్దల సభకు వెళ్లేందుకు సీనియర్ నేతలు ఎన్నో ఆశలతో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేస్తారో అని పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:అనుచరులకు పట్టం : డీసీసీబీల్లో పట్టు కోసం చక్రం తిప్పుతున్న మంత్రులు

రెండు స్థానాలు కూడా అధికార పార్టీకి  దక్కనుండడంతో దాదాపు డజను మందికి పైగా నేతలు ఈ రెండు స్థానాల పై ఆశలు పెంచుకున్నారు. పార్టీ నిర్ణయం మేరకు గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకోవడంతో శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మాజీ ఎంపీ కవితను పెద్దల సభకు పంపుతారని పార్టీ నేతలు అంటున్నారు. వీరితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి రేస్ లో వున్నట్లు తెలుస్తొంది. 

బీసీ సామాజిక వర్గానికి  చెందిన నేతలైన సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని పోటీ చేసేందుకు ఆశించిన దండే విట్టల్ పేరుకూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కేకే కు మరోసారి అవకాశం ఇచ్చే  అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:బీజేపీకి కొత్త సారథులు: తెలుగు రాష్ట్రాల్లో వీరి మధ్యే పోటీ

ఉద్యమ సమయం నుంచి కెసిఆర్ వెంట నడిచిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరు కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు సమాచారం.పెద్దల సభలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎస్సీ లేదా ఎస్టీ లకు ఒకరికి అవకాశం కల్పించే ఛాన్స్  ఉందన్న ప్రచారం  జరుగుతోంది.