Asianet News TeluguAsianet News Telugu

రేపు తెలంగాణలో భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

మంగళవారం(రేపు) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

tomorrow heavy rains in telangana
Author
Hyderabad, First Published Sep 20, 2021, 9:39 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: శనివారం ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షి తమిళనాడు వరకు స్థిరంగా వున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతోపాటు వాయువ్య బంగాళాఖాతంలో1500మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరిత ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో రేపు(మంగళవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.  మరికొన్నిచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వుందని తెలిపారు.  

నిన్న(ఆదివారం) కూడా తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు జల్లుకు కురిసాయి. ఇదేవిధంగా ఇవాళ(సోమవారం) కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

హైదరాబాద్‌ నగరంలో ఆదివారం చిరుజల్లులు కురిసాయి. ఇవాళ మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం(రేపు) మాత్రం హైదరాబాద్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

VIDEO  పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ... కిందకు దూకుతున్న నీటితో సాగర్ అందాలు కనువిందు 

గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియగా మూడునాలుగు రోజులుగా మందగించిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి, కృష్టా నదుల్లోకి మాత్రం వరద నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు అవుట్ ఫ్లో 10,01,445 క్యూసెక్కులుగా ఉంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా సాగర్ లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో  2,16,137 క్యూసెక్కులుగా వుండగా అవుట్ ఫ్లో 1,33,137 క్యూసెక్కులుగా వుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 589.70 అడుగులుగా వుంది. సాగర్ పూర్తిస్థాయి  సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా వుంది. ఇలా ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో 10 క్రస్ట్ గేట్లు ఐదు ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios