తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ తారల పేర్లు డ్రగ్స్ రాకెట్‌లో వెలుగుచూడటంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. అప్పట్లో సిట్ పేరిట ప్రత్యేకాధికారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం నానా హడావిడి చేసింది.

అయితే ఆ తర్వాత ఏమైందో కానీ ఆ కేసు అటకెక్కింది. అయితే డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకు రావడంతో పెద్ద కలకలం రేగింది. సమాచార హక్కు చట్టం ద్వారా సుపరిపాలన వేదిక వెలుగులోకి తీసుకొచ్చిన డ్రగ్స్ కేసు.. విచారణలో స్పీడ్ పెరిగింది.

మరో 5 ఛార్జీషీటు దాఖలు చేస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ఫోరెన్సిక్ నివేదికలు అందాయని, వాటిని ఛార్జిషీట్‌లో పొందుపరుస్తామన్నారు అధికారులు తెలిపారు.

ఈ కేసులో ఛార్జీషీటులో పొందుపరిచిన వారెవ్వరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని ప్రకటించారు. 12 మంది సినీ ప్రముఖులతో ముడిపడిన వ్యవహారంలో 7 ఛార్జీషీట్లు దాఖలు చేశారు. వారికి చేసిన ఫోరెన్సిక్ రిపోర్టు రావడంతో దానిని కలిపి మరో 5 చార్జీషీట్లు వేస్తామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

కోర్టులో విచారణ ద్వారా.. సినీ ప్రముఖులకు శిక్ష ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే కేసు విచారణకే ఏళ్లు పడుతుంటే... తీర్పు మరెన్ని రోజులవుతుందోనని అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వీరి రక్తం, గోర్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దీంతో పలువురి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.