Asianet News TeluguAsianet News Telugu

Today Top Stories: పెరిగిన క్రైం రేటు.. ఇకపై నడిరోడ్డుపైనే డ్రగ్స్ టెస్టులు.. నంది అవార్డులపై కోమటిరెడ్డి

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో తెలంగాణలో పెరిగిన క్రైం రేటు.. డ్రగ్స్ పై కొరడా.. ఇకపై నడిరోడ్డుపైనే డ్రగ్స్ టెస్ట్,  నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన, మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు!వంటి పలు వార్తల సమాహారం.   

today top stories top 10 telugu news for december30 2023 headlines,  Andhra pradesh telangana updates krj
Author
First Published Dec 30, 2023, 7:18 AM IST

Today Top Stories: నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన..

Nandi Awards: నంది పురస్కారం.. తెలుగు చలన చిత్ర సీమ అత్యున్నత పురస్కారం. కానీ,  గత ఐదు సంవత్సరాలుగా నంది అవార్డుల ప్రస్తవనే లేదు. చివరిసారి 2017లో  నంది అవార్డులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఆ తర్వాత ఈ అవార్డుల ప్రదానంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నంది అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.  హైదరాబాద్‌లో జరిగిన నటుడు మురళీ మోహన్ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈమేరకు హామీ ఇచ్చారు.

మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు!
 
పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. మార్చి 18వ తేదీ నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే ఇంటర్, వొకేషన్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ సంబంధింత బోర్డులు ప్రకటించాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు సమాచారం. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే షెడ్యూల్‌ విడుదల కానున్నది. ప్రభుత్వం ఒకే చెబితే.. ఇవాళో.. రేపో పరీక్ష షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది.  

ఇకపై నడిరోడ్డుపైనే డ్రగ్ టెస్టులు..  


Drug Test Kits: సాయంత్రం అయితే చాలు  పోలీసులు బ్రీత్ అనలైజర్లు పట్టుకుని మందుబాబుల పని పట్టడానికి సిద్ధమైపోతారు. మరి వైన్స్, బార్ల సమీపంలోనే ఉంటూ మందుబాబులను టార్గెట్ చేస్తారు. రోడ్డు పక్కన నిలబడి డ్రింక్ అండ్ డైవ్ చేస్తుంటారు. ఒకవేళలో పట్టుబడితే. ఇక అంతే.. భారీ జరిమానాలు, కౌన్సిలింగ్‌లు తప్పవు. పండుగల పూట ఈ చెకింగ్‌ల తీవ్రత పెరుగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగానూ పోలీసులు ఇందుకు రెండింతలు గట్టిగానే సిద్ధం అవుతున్నారు. ఈ సారి ట్రాఫిక్ పోలీసులు కేవలం ఆల్కహాల్ తాగారా? లేదా? అనే టెస్టు మాత్రమే కాదు, డ్రగ్స్ టెస్టు కూడా చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన డ్రగ్ టెస్టు కిట్‌లను ఉపయోగించనున్నారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు పలు రకాల డ్రగ్ టెస్టింగ్ పరికరాలను కొనుగోలు చేశారు. నూతన సంవత్సర వేడుకలకు ముందు భిన్న రకాల 50 డ్రగ్ టెస్టు కిట్‌లను కొన్నారు. వీటి ఆధారంగా ఫామ్ హౌజ్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లు, పార్టీలు చేసుకునే ఇతర ప్రాంతాల్లోనూ టెస్టులు చేయనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు ఈ డ్రగ్ టెస్టు కిట్‌లు అందాయి. ఈ డ్రగ్ టెస్టు కిట్‌ల ద్వారా పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుని డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్‌కు పంపిస్తారు.  


ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదు

తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకూడదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో సింగరేణి అధికారులతో సమీక్షసమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశంలో సింగరేణి ఉపరితల భూగర్భ గనులు, నూతన ప్రాజెక్టులు, థర్మల్ ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టులు, మిషనరీ వినియోగం, బొగ్గు మార్కెటింగ్, రవాణాపై ఆయా విభాగాల డైరెక్టర్ల నుంచి సంబంధిత వివరాలు తెలుసుకున్నారు. దీంతో పాటు సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ కల్పనపై కూడా సమీక్షించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయనేది కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం  మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ కొరత రాకుండా రాష్ట్రంలో అన్ని థర్మల్ కేంద్రాలకు, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు బొగ్గును నిరంతరాయంగా రవాణా చేయాలని ఆదేశించారు.

పెరిగిన క్రైం రేటు

తెలంగాణ పోలీస్ శాఖ వార్షిక నివేదికలు విడుదల చేసింది. గతేడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర పోలీసుల వార్షిక నివేదిక వెల్లడించింది. వార్షిక క్రైమ్ రిపోర్ట్ 2023ని విడుదల చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) రవి గుప్తా మాట్లాడుతూ..  అసెంబ్లీ ఎన్నికలు, వివిధ పండుగల కోసం బందోబస్త్ ను ప్రశాంతంగా నిర్వహించామని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు సజావుగా సాగయని తెలిపారు. అయితే.. గతేడాదితో పోలిస్తే..రాష్ట్రవ్యాప్తంగా 2 శాతం నేరాల రేటు పెరిగింది. అంటే.. రాష్ట్రవ్యాప్తంగా 8.97 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని తెలిపారు. గత ఏడాది 1,95,582 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదు చేశామని డీజీపీ పేర్కొన్నారు. సైబర్ నేరాలు కూడా ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి, 2022లో 13,895 కేసులకు గాను 2023లో మొత్తం 16,339 కేసులు నమోదయ్యాయి.

టీమిండియాకు ఐసీసీ షాక్.. 
 

ICC fined India: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త్ కు ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) షాక్ ఇచ్చింది. భారత జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానా విధించింది. అలాగే, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో 2 ముఖ్యమైన పాయింట్లను క‌ట్ చేసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ మూడు రోజుల్లోనే ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత జట్టుకు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ శిక్ష విధించారు. ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయక సిబ్బంది కోసం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, స్లో ఓవర్ రేట్ కార‌ణంగా మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించింది. అలాగే, డబ్ల్యూటీసీలో ఒక్కో ఓవర్ కు ఒక పాయింట్ కట్ అవుతుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios