Asianet News TeluguAsianet News Telugu

నేడు తెలంగాణలో భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

today 22nd september heavy rains in telangana
Author
Hyderabad, First Published Sep 22, 2021, 10:13 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ(బుధవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. జిల్లాలతో పాటు హైదరాబాద్(Hyderabad Rains) లో కూడా ఇవాళ వర్షం కురిసే అవకాశం వుందని ప్రకటించారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో కొనసాగుతోందని తెలిపారు. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే  అల్పపీడన ప్రాంతం నుండి ఒడిషా మీదుగా తెలంగాణ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వీటన్నింటి ప్రభావంతోనే తెలంగాణలో బుధ, గురువారాలు వర్షాలు కురుస్తాయని తెలిపారు.  

అయితే బుధవారం తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రేపు(గురువారం) మాత్రం అంతటా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలిపారు. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న ప్రాంతాల్లో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

నిన్న(మంగళవారం) కూడా తెలంగాణలో వర్షాలు కురిసాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా తోమలపల్లిలో 4.9 సెంటిమీట్లర్లు, ఖమ్మం జిల్లా రావినూతలలో  4.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. రాజధాని హైదరాబాద్ లో చిరుజల్లుకు కురిసి వాతావరణం చల్లబడింది.

గత మూడురోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గత ఆదివారం మోస్తరు వర్షాలు కురియగా సోమవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. సోమవారం రాత్రి అత్యధికంగా మెదక్ జిల్లాలోని చిట్కుల్ లో 14సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యింది.  హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలో కూడా కుండపోత వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ లో 12సెం.మీ, భువనగిరిలో 10.03సెం.మీ, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 9.08సెంమీ వర్షపాతం నమోదయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios