హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్ లో టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ పోలీసులు ఓ బ్రోతల్ హౌస్ పై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. బ్రోతల్ హౌస్ నడుపుతున్న శ్రవణి కుమారితో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. 

వారి నుంచి నగదు, నాలుగు సెల్ ఫోన్లు, వాడిన కండోమ్, మరో వాడని కండోమ్ స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలికి విముక్తి కలిగించారు. అరెస్టయిన వారిని శ్రవణి కుమారి (40), ఎం రమణ (31), విజయ్ శంకర్ లుగా గుర్తించారు. 

నిర్వాహకురాలు శ్రవణి కుమారి హైదరాబాదులోని యూసుఫ్ గుడాలో నివాసం ఉంటోంది. బాధితురాలు పశ్చిమ గోదావరి జిల్లా నివాసి అని తేలింది. 

మూడు నెలల క్రితం శ్రవణి కుమారి యూసుఫ్ గుడాలోని కృష్ణానగర్ లో 11 వేల రూపాయల నెల అద్దెకు ఇల్లు తీసుకుని బ్రోతల్ నడుపుతోంది. హైదరాబాదులోని వివిధ ప్రాంతాల నుంచి ఆమె సెక్స్ వర్కర్లను తెచ్చేది. ఒక్కొక్కరికి 15 రోజులకు 30 రూపాయల చొప్పున చెల్లించేది. 

రెండు వారాల క్రితం పశ్చిమ గోదావరి నుంచి ఆమె ఓ మహిళా సెక్స్ వర్కర్ ను తీసుకుని వ్చచింది. పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బ్రోతల్ పై దాడి చేశారు .బాధితురాలిని, నిందితులను వారు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.