కాగజ్‌నగర్: కుమ్రం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో శనివారం నాడు రాత్రి ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 

పేపర్ మిల్లులో విద్యుత్ ప్లాంట్ కోసం జరుగుతున్న బాయిలర్ నిర్మాణం పనుల్లో ఒక్కసారిగా మట్లి దిబ్బలు మీదపడ్డాయి. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.  ఒక్కో షిఫ్టులో సుమారు 12 మంది కార్మికులు ఈ ప్రదేశంలో పనిచేస్తున్నారని స్థానికులు చెప్పారు.

సంఘటన జరిగిన సమయలో ఎంత మంది కార్మికులు ఉన్నారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మృతి చెందిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా  స్థానికులు అనుమానిస్తున్నారు.