Asianet News TeluguAsianet News Telugu

ఆస్తుల కేసులో కోర్టుకు హాజరైన మంత్రి సబితా, మాజీ మంత్రి ధర్మాన

ఆస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులు శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు.

Telangana minister Sabitha indra Reddy appears before Nampally CBI Court
Author
Hyderabad, First Published Jan 17, 2020, 11:28 AM IST

హైదరాబాద్: జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.ఆస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ అనుబంధ చార్జీషీట్‌లో సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు కోర్టుకు హాజరయ్యారు. 

Also read: ఈడీ కేసులో మినహయింపు కోరిన జగన్

ఈ నెల 10వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కూడ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోర్టుకు కోరారు. అయితే ఈ విషయమై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

Also read:ఆస్తుల కేసు: సీబీఐ కోర్టుకు హాజరైన ఏపీ సీఎం జగన్

Also read:అక్రమాస్తుల కేసు: తప్పనిసరి పరిస్థితుల్లో, ఎల్లుండి సీబీఐ కోర్టుకి జగన్

ఇవాళ తెలంగాణ మంత్రి సబితారెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా  పనిచేసి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావులు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.  ఈ కేసులో వీరిద్దరితో పాటు ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, రాజగోపాల్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శ్యామ్యూల్ తదితరులు కోర్టుకు వచ్చారు.

ఏపీ సీఎం జగన్‌ కేసులో  ఇవాళ సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ ఇప్పటికే సీబీఐ కోర్టును కోరారు.కానీ ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

డిశ్చార్జ్‌ పిటిషన్‌లన్నీ కలిపి విచారించాలన్న జగన్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి అయ్యాయి.  ఇప్పటికే ఓసారి జగన్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు ఊరట లభిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ వైసీపీ వర్గాల్లో నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios