హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ ఆజయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఆయన కాన్వాయ్ లో సోమవారం ప్రమాదం జరిగింది. మంత్రి కాన్వాయ్ లోని వాహనాలు ఒక్కదాన్నొక్కటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. 

కాన్వాయ్ లోని మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంగళరావు పార్కు వద్ద ఓ బైక్ ను తప్పించబోయి మంత్రి కాన్వాయ్ లోని వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం తర్వాత మంత్రి వేరే వాహనంలో వెనుదిరిగి వెళ్లిపోయారు. 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.