అతనికి రెండు దశాబ్దాల  క్రితమే వివాహమైంది. కొంతకాలంపాటు.. వారి కాపురం బాగానే సాగింది. ఏమైందో తెలీదు.. అతనిని భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.  కూతురిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయిన భార్య 20 సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి మళ్లీ రాలేదు. అప్పటి నుంచి అతను ఒంటరిగానే జీవిస్తున్నాడు.

 ఇటీవల అతనికి మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. చిరవకు... అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా  ముమునూరులో చోటుచేసుకుంది.

Also Read పాలుపోసేవాడితో భార్య రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త..

పూర్తి వివరాల్లోకి వెళితే... మూమునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మాపురం-సింగారం గ్రామాల మధ్య అశోక్(40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. రోడ్డుపై అతని శవం పడి ఉండగా.. పక్కనే బైక్ ఉంది. తలమీద బలమైన గాయం కావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది.

అతనిని 20 సంవత్సరాల క్రితమే భార్య వదిలేసిందని.. ప్రస్తుతం మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధం కారణంగానే అతను హత్య కు గురై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంఘటన స్థలం సమీపంలో పోలీసులకు దొరికిన ఆధారాల ప్రకారం రోడ్డుకు కొద్ది దూరంలోని చెట్ల పొదల్లో అశోక్‌తో దుండగులు గొడవ పడినట్లుగా తెలుస్తోంది. మృతుడి చేతులకు కట్టిన రక్తపు మరకల తాళ్లు పోలీసులకు లభించాయి. 

అశోక్‌ రెండు నెలలుగా వరంగల్‌ నుంచి ఒంటిమామిడిపల్లికి నిత్యం తిరుగుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఒంటిమామిడిపల్లికి చెందిన మహిళతో అశోక్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. ఆ మహిళ బంధువులే అశోక్‌ను హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు