మంచినీరు అనుకొని  కోరోసిన్ తాగి 11నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన సాయి చరణ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య మీన, ముగ్గురు పిల్లు ఉన్నారు. 

Also Read సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి....

కాగా.. గురువారం ఉదయం శివరాత్రి సందర్భంగా సాయిచరణ్, భార్య మీన కలిసి ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. ఆ సమయంలో దంపతులు మూడో సుపుత్రుడు సాయి వర్థన్(11నెలల) ఆడుకుంటూ స్టవ్ వద్దకు వెళ్లాడు. మంచినీరు అనుకొని స్టవ్ దగ్గర ఉన్న కిరోసిన్ తీసుకొని తాగేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు.

వెంటనే గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని బోదన్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ వెళ్లాల్సిందిగా సూచించారు. డాక్టర్ల సూచన మేరకు నిజామాబాద్ తీసుకువెళ్లగా.. అప్పటికే బాలుడు చనిపోయాడు.అయితే... కుటుంబసభ్యులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. తమ చిన్నారి కుమారుడు తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోవడం చూసి ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.