హైదరాబాద్:  డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గురువారం నాడు హైకోర్టు ఆదేశించింది.గురువారం నాడు డ్రగ్స్ కేసు విషయమై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

also read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సంచలన విషయాలు వెల్లడించిన రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి

డ్రగ్స్ కేసుపై లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉండే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.2017లో ఈ కేసుపై రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

 

ఈ కేసు విచారణకు  ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని సీబీఐ, ఈడీ ఎన్ సీబీ సంస్థలకు అప్పగించాలని  ఆయన ఆ పిల్ లో కోరారు.రేవంత్ రెడ్డి తరపున ప్రముఖ లాయర్ రచనా రెడ్డి హైకోర్టులో వాదించారు. డ్రగ్స్ కేసు  విచారణకు ఈడీ, ఎన్ సీబీ సిద్దంగా ఉన్నాయని లాయర్ రచనా రెడ్డి  ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఈడీ, ఎస్ సీ బీకి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని ఆమె వాదించారు. సిట్ దర్యాప్తు పరిస్థితిపై డిసెంబర్ 10 లోపు తెలపాలని  ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది.