హైదరాబాద్: డ్రగ్స్ కేసును ఈడీ, ఎన్సీబీకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది.

ఈ పిటిషన్‌పై గురువారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది.డ్రగ్స్ కేసును ఈడీ, ఎన్సీబీకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాది  హైకోర్టును కోరారు. డ్రగ్స్ కేసులో మూడేళ్లుగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం లేదని పిటిషనర్ కోరారు. ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.

also read:డ్రగ్స్ కేసు: ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు  చివరి అవకాశం ఇచ్చింది. ఈ దఫా కచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. డ్రగ్స్ కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

డ్రగ్స్ కేసును  ఎన్సీబీకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి 2017లో హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఎన్సీబీతో ఈ కేసును విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.