తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కరోనా నిర్దారణ టెస్టుల సంఖ్య పెంచాలని తెలంగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కరోనా నిర్దారణ టెస్టుల సంఖ్య పెంచాలని తెలంగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
మూడు నెలల తర్వాత తెలంగాణలో 100 మార్క్‌ను దాటిని రోజువారి కేసులు..
తెలంగాణలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. మూడు నెలల తర్వాత రాష్ట్రంలో రోజువారి కరోనా కేసుల సంఖ్య వంద మార్క్‌ను దాటింది. ఈ ఏడాది మార్చి ఏడో తేదీన 102 కేసులు నమోదు కాగా.. సరిగ్గా మూడు నెలలకు మంగళవారం ఒక్క రోజులోనే 119 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేసులలో ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 79 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,93,791కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,111గా ఉంది.
నిన్న కరోనా నుంచి 43 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 7,89,022కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 658 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 0.75 శాతంగా ఉంది.
భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. చాలా రోజుల తర్వాత రోజువారి కరోనా కేసుల సంఖ్య 5 వేల మార్క్‌ను దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,233 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. 93 రోజుల తర్వాత రోజువారీ కేసులు ఐదువేలకు పైగా నమోదయ్యాయి. అయితే కిందటి రోజు దేశంలో 4,518 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య.. 4,31,90,282కి చేరింది.
గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 5,24,715 కు చేరుకుంది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,300 మందికి పైగా కరోనా నుంచి కోలుకోవడంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,26,36,710కి చేరింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.72 శాతంగా ఉంది. ఇక, ప్రస్తుతం దేశంలో 28,857 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.12 శాతంగా ఉంది. భారత్‌లో మంగళవారం 14.9 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,43,26,416కు చేరింది.
