Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీలో కాగ్ నివేదిక: కాళేశ్వరంపై కీలక అంశాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై  కాగ్ నివేదికలో  కీలక విషయాలు పొందుపర్చారు. మూడో టీఎంసీకి అదనంగా రూ. 25 వేల కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చిందని కాగ్ తెలిపింది.

Telangana Government Tables CAG Report in Telangana Assembly lns
Author
First Published Feb 15, 2024, 12:58 PM IST | Last Updated Feb 15, 2024, 12:58 PM IST

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా  ప్రయోజనాల్లో  అదనపు పెరుగుదల లేదని కాగ్ పేర్కొంది.కాళేశ్వరం ప్రాజెక్టుకు  ప్రతి ఏటా  విద్యుత్ వినియోగానికి  రూ. 3.555 కోట్లు అదనపు వ్యయం పెరిగిందని  ఈ నివేదిక వివరించింది. రీ ఇంజనీరింగ్ మార్పుల వల్ల అప్పటికే  చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని కాగ్ నివేదిక వెల్లడించింది. రీ ఇంజనీరింగ్ మార్పుల వల్ల  రూ. 765 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.

పనుల అప్పగింతలో  నీటిపారుదల తొందరపాటు ప్రదర్శించిందని  కాగ్ అభిప్రాయపడింది.డీపీఆర్ ఆమోదానికి  ముందే  రూ. 25 వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని  కాగ్ నివేదిక తెలిపింది.  అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారని కాగ్  అభిప్రాయపడింది.అదనపు టీఎంసీ కోసం చేపట్టిన పనులతో రూ. 25 వేల కోట్లు అదనపు వ్యయంగా కాగ్ తెలిపింది.

సాగునీటిపై మూలధన వ్యయం  ఒక్కో ఎకరానికి రూ. 6.42 లక్షలు అవుతుందని  కాగ్ వివరించింది.ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి 1.51 గా అంచనా వేసినట్టుగా  కాగ్ తెలిపింది.ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి 0.75 గా తేలిందని కాగ్ వివరించింది.అంతేకాదు ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి మరింత తగ్గే అవకాశం కూడా ఉందని కాగ్ అభిప్రాయపడింది.

లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్నసాగర్ నిర్మించినట్టుగా  కాగ్ పేర్కొంది.2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై కాగ్ నివేదికను వెల్లడించింది.రెవిన్యూ రాబడి ఎక్కువ చూపి రెవెన్యూ లోటును తక్కువ చూపినట్టుగా కాగ్ అభిప్రాయపడింది. విద్య, వైద్యం మీద ఖర్చులో రాష్ట్రం వెనుకబడి ఉందని తెలిపింది.రాష్ట్రప్రభుత్వం చేసిన వ్యయంలో విద్యపై 8 శాతం మాత్రమే ఖర్చు చేశారని  కాగ్ వివరించింది.మొత్తం వ్యయంలో ఆరోగ్యంపై 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని కాగ్ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి లేదని  కాగ్ వివరించింది.విభజన ఆస్తుల పంపకాల విషయమై తగినంత దృష్టి లేదని కాగ్ అభిప్రాయపడింది. రూ.1.18 లక్షల కోట్ల బడ్జెట్ వెలుపలి రుణాలను బడ్జెట్ లో వెల్లడించలేదని  కాగ్ పేర్కొంది. అప్పుల ద్వారానే  రెవిన్యూ లోటును భర్తీ చేయాల్సి వచ్చిందని కాగ్ తెలిపింది.

రుణాలపై వడ్డీ 2032-33 నాటికి రూ. 2.52 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందని కాగ్ అభిప్రాయపడింది.బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు తక్కువగా ఉందని కాగ్ వివరించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios