అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా భారత పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో వారికి విందు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. దీంతో ముఖ్యమంత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకలకు కేసీఆర్ ప్రత్యేక బహుమతులు అందించనున్నారు.

Also Read:ట్రంప్ తో విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్: ఏపీ సీఎం వైఎస్ జగన్ డౌట్

ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటోను బహకరించనున్నారు. అనంతరం మెలానియా, ఇవాంకల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన పోచంపల్లి, గద్వాల్ చీరలను కేసీఆర్ అందజేయనున్నారు.

ట్రంప్ విందులో తెలంగాణ వంటకాలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 

Also Read:డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన... సీఎం కేసీఆర్ కు అరుదైన అవకాశం

విశిష్ట అతిథి ట్రంప్ కోసం ఏర్పాటుచేసిన ఈ విందుకు అతి తక్కువగా అంటే కేవలం 90 నుంచి 95 మంది అథితులకు మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు.ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో సహా కేవలం కొద్దిమంది కేంద్ర మంత్రులకు మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానం అందింది.

రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ సీఎంతో పాటు అస్సాం, హర్యానా, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలకు  చెందిన మొత్తం 8 మంది ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.