Asianet News TeluguAsianet News Telugu

గంజాయిపై యుద్ధం, ఎంతటివారైనా ఉపేక్షించం: కేసీఆర్ వార్నింగ్


గంజాయిపై యుద్దం ప్రకటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతుందన్నారు.పరిస్థితి తీవ్రం కాకముందే గంజాయిని అరికట్టాల్సిన అవసరం గురించి ఆయన నొక్కి చెప్పారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారన్నారు.
 

Telangana CM KCR reviews on Drugs
Author
Hyderabad, First Published Oct 20, 2021, 4:44 PM IST

హైదరాబాద్: గంజాయిపై యుద్ధం ప్రకటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.drugs, గంజాయి నిర్మూలన కోసం బుధవారం నాడు ప్రగతిభవన్ లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Ganja అక్రమసాగు వినియోగంపై ఉక్కు పాదం మోపాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతుందన్నారు.పరిస్థితి తీవ్రం కాకముందే గంజాయిని అరికట్టాల్సిన అవసరం గురించి ఆయన నొక్కి చెప్పారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారన్నారు.

also read:డ్రగ్స్‌ నిర్మూలన: ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష

తెలిసీ తెలియక యువత బారినపడుతున్నారు.డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక పరిస్థితి దెబ్బతింటుందని చెప్పారు.ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.గంజాయిపై డీజీ స్థాయి అధికారి నియమిస్తామని Kcrప్రకటించారు.విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇంటలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.గుడుంబా, గ్యాంబ్లింగ్ మళ్లీ వస్తున్నాయని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించారు.గంజాయి సాగుకు పాల్పడే నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్నారు.

తెలంగాణకు చెందిన పోలీసులు ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పెద్ద ఎత్తున  సోదాలు నిర్వహించారు. గంజాయి సాగు చేస్తున్నవారిపై కేసులు పెట్టారు. సుమారు 150 మందికిపైగా కేసులు నమోదయ్యాయి.గంజాయి సరఫరా చేస్తున్న వారిపై 23 మందిపై పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు. డ్రగ్స్, గంజాయి సరఫరాపై నిఘా పెంచాలని  కూడా ఇవాళ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios