Asianet News TeluguAsianet News Telugu

అడవులను నాశనం చేసే వారిపై కఠినంగా వుండండి.. మీదే కీలకపాత్ర: కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం

అటవీ భూముల (forest lands) రక్షణలో కలెక్టర్లు కీలకపాత్ర పోషించాలన్నారు తెలంగాణ సీఎం (telangana cm) కేసీఆర్ (kcr) . శనివారం పోడు భూముల (podu land సమస్య పరిష్కారం, అటవీ రక్షణ, హరితహారం అంశాలపై ప్రగతి భవన్‌లో (pragathi bhavan) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది

telangana cm kcr review meeting on forests lands
Author
Hyderabad, First Published Oct 23, 2021, 8:10 PM IST

అటవీ భూముల (forest lands) రక్షణలో కలెక్టర్లు కీలకపాత్ర పోషించాలన్నారు తెలంగాణ సీఎం (telangana cm) కేసీఆర్ (kcr) . శనివారం పోడు భూముల (podu land సమస్య పరిష్కారం, అటవీ రక్షణ, హరితహారం అంశాలపై ప్రగతి భవన్‌లో (pragathi bhavan) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అడవులను పునరుజ్జీవంపజేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అడవి మీద ఆధారపడ్డ గిరిజనులకు మేలు చేయాలని సీఎం సూచించారు. 

అడవులను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అడవుల రక్షణలో గ్రామ సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సీఎం దిశానిర్దేశం  చేశారు. అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని కేసీఆర్ తెలిపారు. జిల్లాల్లో అటవీ భూముల పరిరక్షణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం సూచించారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనుల నుంచి క్లెయిమ్స్ స్వీకరించాలని కేసీఆర్ పేర్కొన్నారు. గంజాయి సాగు చేస్తే రైతుబంధు, రైతు బీమా, విద్యుత్‌ను నిలిపివేస్తామని సీఎం హెచ్చరించారు. గంజాయి సాగు చేసేవారిని జైలుకు పంపేలా  చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తి స్థాయిలో అరికట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ALso Read:గంజాయి సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా కట్: కేసీఆర్ సంచలన నిర్ణయం

కాగా.. రాష్ట్రంలో గంజాయి సాగుపై కేసీఆర్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. గంజాయి సాగు చేస్తే రైతుబంధు (rythu bandhu scheme) , రైతు బీమా రద్దు (rythu bheema) చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్‌వో‌ఎఫ్‌ఆర్‌లో సాగు చేస్తే పట్టాలు రద్దు అని సీఎం హెచ్చరించారు. త్వరలోనే డ్రగ్స్ నియంత్రణపై మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఒక్క గంజాయి మొక్క కూడా కనిపించకూడదని.. పాళశాల పుస్తకాల్లో డ్రగ్స్ ప్రమాదంపై సిలబస్ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి లభ్యత పెరిగిందని.. నిర్లక్ష్యం చేస్తే చేయిదాటే ప్రమాదం వుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. 

అంతకుముందు గంజాయిపై యుద్ధం ప్రకటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. drugs, గంజాయి నిర్మూలన కోసం బుధవారం నాడు ప్రగతిభవన్ లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Ganja అక్రమసాగు వినియోగంపై ఉక్కు పాదం మోపాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతుందన్నారు.పరిస్థితి తీవ్రం కాకముందే గంజాయిని అరికట్టాల్సిన అవసరం గురించి ఆయన నొక్కి చెప్పారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios