తిరుపతి:  ఎస్వీబీసీ ఛానెల్ లో పోర్న్ సైట్ల విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు మెయిల్ చేస్తే  ఆ భక్తుడికి పోర్న్ సైట్ లింకును ఎస్వీబీసీ ఉద్యోగులు పంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఎస్వీబీసీలో పోర్న్ సైట్లను చూసిన వారితో పాటు భక్తులకు ఈ సైట్ లింకులను పంపిన వారిని కఠినంగా శిక్షించాలని  సీఎం ఆదేశించారు. ఎస్వీబీసీ చానెల్ ను ప్రక్షాళన చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఆథ్యాత్మిక చింతనతో శ్రీవారి విశిష్టతను వివరించేలా కార్యక్రమాలు ప్రసారం చేయాలని జగన్  కోరారు. 

దీంతో షాకైన భక్తుడు టీటీడీ ఛైర్మెన్, ఈవోలకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఎస్వీబీసీ చానెల్ లో సోదాలు నిర్వహించిన అధికారులకు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

also read:ఎస్వీబీసీ ఛానెల్ లో పోర్న్ సైట్ల కలకలం: ఒకరి అరెస్ట్

పోర్న్ సైట్స్ చూసే ఉద్యోగులు కొందరిని గుర్తించారు. 25 మంది ఉద్యోగులు విధులను పక్కన పెట్టి ఇతర సైట్లు చూస్తున్నట్టుగా తేలింది.పోర్న్ సైట్లతో సంబంధం ఉన్న ఉద్యోగులను  విధుల నుండి తప్పించారు. కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు వీలుగా టీటీడీ పాలకవర్గం చర్యలు తీసుకొంటుంది.