సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేట యువతి హైదరాబాదులో అత్యాచారానికి గురైంది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు తరలిస్తుండగా ఆమె మరణించింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. అయితే, ఆ విషయం బయటపడింది.

నల్లగొండ గురుకుల కళాశాలలో 20 ఏళ్ల కోటేశ్వరి డిగ్రీ చదువుతోంది. పీజీ కోచింగ్ కోసం ఆమె గురువారంనాడు హైదరాబాదులోని ఘట్కేసర్ కు వచ్చింది. ఆరోగ్యం బాగా లేదని శుక్రవారం ఆమె తల్లిదండ్రులకు పోన్ చేసింది. దాంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రిలో చేర్చించారు.

యువతిపై అత్యాచారం జరిగిందని ఖమ్మం వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు తరలిస్తుండగా ఆమె మరణించింది. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

కోదాడ ఆస్పత్రి ముందు మృతురాలి బంధవులు ఆందోళన చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ అంటున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.