డాడీ వద్దు: 13 బాలికపై సవతి తండ్రి అత్యాచారం

Step father sexually assaulted girl
Highlights

హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వరుసకు తండ్రి అయిన వ్యక్తి 13 ఏళ్ల అమ్మాయి లైంగిక దాడి చేశాడు.

హైదరాబాద్: హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వరుసకు తండ్రి అయిన వ్యక్తి 13 ఏళ్ల అమ్మాయి లైంగిక దాడి చేశాడు. విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దారుణంగా హింసించాడు. 

అయితే, చివరకు ధైర్యం చేసి తల్లి సహాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు 8 ఏళ్ల క్రితం నిందితుడు వితంతువు వివాహం చేసుకున్నాడు. భర్తతో ఆమెకు ఓ కూతురు ఉంది. భార్య ఇంట్లో లేని సమయంలో సవతి కూతురిపై అతను లైంగిక దాడి చేశాడు. 

సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత తల్లి పనికి వెళ్తుంటే కూతురు భయంతో వణికిపోయింది. తనను వదిలి వెళ్లొద్దంటూ ఏడ్చింది. కూతురు ద్వారా విషయం తెలుసుకున్న భార్య భర్తను నిలదీసింది. 

ముందు అతను బుకాయించాడు. మద్యం మత్తులో తప్పు చేశానని, క్షమించాలని వేడుకున్నాడు. దాంతో అతన్ని క్షమించారు. కానీ నెల రోజుల తర్వాత మళ్లీ కూతురిపై లైంగిక దాడి చేశాడు. బెల్టుతో చితకబాదాడు. దాంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

loader