అజ్ఞాతంలోకి డీఎస్ కొడుకు సంజయ్, పోలీసులు గాలింపు

Special police teams searching for DS son Sanjay.
Highlights

 డిఎస్ తనయుడు సంజయ్ అరెస్టుకు నిజామాబాద్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీఎస్ కుటుంబానికి చెందిన శాంకరి నర్సింగ్ కళాశాలకు చెందిన  విద్యార్థినులు సంజయ్ తమను లైంగికంగా వేధించాడని రాష్ట్ర హోమంత్రి నాయిని తో పాటు నిజామాబాద్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిపై పోలీసులు నిర్భయ కేసుతో పాటు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

 డిఎస్ తనయుడు సంజయ్ అరెస్టుకు నిజామాబాద్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీఎస్ కుటుంబానికి చెందిన శాంకరి నర్సింగ్ కళాశాలకు చెందిన  విద్యార్థినులు సంజయ్ తమను లైంగికంగా వేధించాడని రాష్ట్ర హోమంత్రి నాయిని తో పాటు నిజామాబాద్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిపై పోలీసులు నిర్భయ కేసుతో పాటు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రస్తుతం సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు నిజామాబాద్ పట్టణంలో సంజయ్ తలదాచుకుని ఉంటాడని భావిస్తున్న పోలీసులు సంజయ్ జాడ కోసం వెతుకుతున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శాంకరీ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదివే విద్యార్థినులు సంజయ్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. పీఓడబ్ల్యూ నేత సంధ్య నేతృత్వంలో విద్యార్థినులు గురువారం సచివాలయంలో హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా ఉంటామని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే నిజామాబాద్  సీపీని కలిసి ఫిర్యాదు చేయాలని హోం మంత్రి విద్యార్థినులకు సూచించారు. హోంమంత్రి సూచన మేరకు విద్యార్థినులు శుక్రవారం నాడు మధ్యాహ్నం  నిజామాబాద్ సీపీ కార్తికేయను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  సంజయ్ పై  ఇవాళ నిజామాబాద్ పోలీసులు  సంజయ్ పై నిర్భయ కేసుతో పాటు మరో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ విషయం తెలిసినప్పటి నుండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. అయితే అతడి అరెస్ట్ కు రంగం సిద్దం చేసిన పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వార్తల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://telugu.asianetnews.com/telangana/nizamabad-police-files-nirbhaya-case-against-sanjay-pcvy5b

https://telugu.asianetnews.com/andhra-pradesh/dharamapuri-aravind-reacts-on-sexual-harassments-on-sajay-pcvnup

https://telugu.asianetnews.com/telangana/nursing-college-students-complaint-against-dr-sanjay-to-nizamabad-cp-pcvlpx

https://telugu.asianetnews.com/telangana/no-realtionship-with-nursing-students-says-d-sanjay-pcvg2e

loader