Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ మత్తులో జోగుతున్న హైదరాబాద్ పిల్లలు

హైదరాబాద్ స్కూల్ పిల్లలు డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు.బడిలో బుద్దిగా చదువుకోవాల్సిన ఆడ పిల్లలు, మగ పిల్లలు డ్రగ్స్ వినియోగదారుల అవతారమెత్తుతున్నారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ ముఠా గుట్టును హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. విచారణలో భయంకర నిజాలు వెల్లడయ్యాయి. కోటీశ్వరుల పిల్లలే డగ్రస్ వినియోగిస్తున్నారు. ప్రముఖ పాఠశాలే డ్రగ్స్  వినియోగ కేంద్రాలుగా మారిపోయాయి.

some of the students in hyderabad becoming drug addicts

8వ తరగి నుంచి ఇంటర్, డిగ్రీ పిల్లల్లో డ్రగ్స్ అలవాట్లు పెరిగిపోతున్నాయి. ధనవంతుల పిల్లలను టార్గెట్ చేసుకుని వారికి రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుట్టు రట్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరోవైపు డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి రావడంతో తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. డ్రగ్స్ వినియోగం ప్రమాదకరంగా మారడంతో దర్యాప్తు కోసం ఇద్దరు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది సర్కారు.

 

హైదరాబాద్ లో ధనవంతులు, కోటీశ్వరుల పిల్లలు చదివే ప్రముఖ పాఠశాలలను టార్గెట్ చేసి ఆ స్కూళ్లలో చదివే పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు ముగ్గురు వ్యక్తులు. 8వ తరగతి చదివే ఆడపిల్లలకు సైతం వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఒక విద్యార్థిని అయితే డ్రగ్స్ వాడిన పది రోజులకే బానిసగా మారిపోయింది. డ్రగ్స్ బూచోళ్లు 8వ తరగతి నుంచి ఆ పై తరగతులు చదువుతున్న ఆడ, మగ తేడా లేకుండా పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ప్రముఖుల పిల్లలను టార్గెట్ చేసి నైజీరియన్లు ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు వీరికి ఖాతాదారులుగా మారిపోయారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 22 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

 

ఈ సంఘటనపై ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.

 

తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్, స్టేట్ టాస్క్ ఫోర్స్ సమన్వయంతో డ్రగ్స్ రాకెట్ కు చెక్ పెట్టాము.

మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేశాము.

వారు Lsd, MDMA అనే  డ్రగ్ ను ఈ ముఠా ప్రదానం గా సరఫరా చేస్తోంది.

700 యూనిట్ lsd,  mdma 34 గ్రాములు సీజ్ చేశాం.

స్వాధీనం చేసుకున్న డ్రగ్ ఒక్కో చుక్క వేల రూపాయల ఖరీదు చేస్తుంది.

మానసిక రుగ్మతల కారణంగానే పిల్లలు, పెద్దలు ఈవిధమైన డ్రగ్ కు అలవాటు పడుతున్నారు.

నిందితులను విచారించడంతో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు,  కాలేజ్ యువత ఈ డ్రగ్ ను తీసుకున్నట్లు వెల్లడైంది..

ముఠా కు సినీ పరిశ్రమ తో పాటు MNC ఎంప్లాయిస్, స్కూల్ స్టూడెంట్ కు లింక్ లు బయట పడ్డాయి.

అరెస్ట్ అయిన వారు ముగ్గురు చదువు కున్నవారే. మల్టీ నేషన్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారు.

కెల్విన్ మస్ర, అబ్దుల్ బాహాద్, అబ్దుల్ కుదుస్ లు నిందితులుగా గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టాం.

కోర్టు 14రోజుల రిమాండ్ కు తరలించింది.

నిందితుల నుంచి సెల్ ఫోన్ డేటా సేకరించాం, ఫోరెన్సిక్ సెల్ కి పంపించాం.

ఎంత మందికి ముఠా తో సంబంధాలున్నాయి ఎంత మందికి క్రియవిక్రయాలు జరిపారనే కోణం లో దర్యాప్తు చేస్తున్నాం.

డ్రగ్స్ వ్యవహారం పై విచారణ కొనసాగుతోంది.

21 మంది vip లలో 9 మంది ని విచారించాం

మిగతా వారి ని కూడా విచారిస్తాం

సినిమా ఇండస్ట్రీ కి చెందిన  నిర్మాత  నెంబర్  కెల్విన్  మెసేజ్ లో ఉంది.

ఆ నిర్మాత కి గతం లో డ్రగ్స్ తీసుకున్న చరిత్ర ఉంది.

హైదరాబాద్ లో ని 8 ఇంజినీరింగ్ కాలేజీల యజమ్నాయాలకు, 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ మేనేజ్ మెంట్లకు లేఖలు రాసినట్లు అకున్ సబర్వాల్ వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios