ఇంజనీరింగ్ విద్యార్థినిపై సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగి రేప్

Software employee held for raping engineering student
Highlights

ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని మోసం చేసి రేప్ చేసిన కేసులో హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసులు మంగళవారంనాడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని అరెస్టు చేశారు.

హైదరాబాద్: ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని మోసం చేసి రేప్ చేసిన కేసులో హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసులు మంగళవారంనాడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని అరెస్టు చేశారు. ఎల్బీ నగర్ ఇన్ స్పెక్టర్ కాశిరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడింాచరు 

కె. రవితేజ అనే 26 ఏళ్ల యువకుడు బాధితురాలికి బంధువే అవుతాడు. ఓ కుటుంబ వేడుకలో రవితేజతో బాధితురాలికి కొన్నేళ్ల క్రితం పరిచయమైంది. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. రెండు కుటుంబాలవాళ్లు కూడా ఆంగీకరించారు. 

సాన్నిహిత్యాన్ని అవకాశంగా తీసుకున్న రవితేజ బాధితురాలిని నాగోల్ లోని తన ఇంటికి పిలిచి ఆమెపై లైంగిక దాడి చేసాడు. ఆ సంఘటన తర్వాత అతను, అతని కుటుంబ సభ్యులు అమ్మాయి కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చారు. 

ఆ తర్వాత ఓసారి బాధితురాలి కుటుంబ సభ్యులు రవితేజ ఇంటికి వెళ్లారు. పెళ్లికి అంగీకరించాలని కోరారు. దాంతో ఆగ్రహించిన రవితేజ తండ్రి కె. జగదీశ్వర్ బాబు బాధితురాలి జ్టటు పట్టి అవతలికి లాక్కెళ్లాడు. బాధితురాలి కుటుంబ సభ్యులను చల్లబరచడానికి రవితేజ నిశ్చితార్థానికి అంగీకరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరిగింది.

ఆ తర్వాత మళ్లీ బాధితురాలి కుటుంబానికి రవితేజ కుటుంబ సభ్యులు దూరంగా ఉంటూ వచ్చారు. బాధితురాలు రవితేజను విషయం అడిగితే, తమ వద్దకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు .

దాంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రవితేజను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారు 

loader