హైదరాబాద్: టాలీవుడ్‌ సినీ ప్రముఖులకు డ్రగ్స్‌తో లింకులపై సిట్ చార్జీషీట్ దాఖలు చేసింది. ఇప్పటివరకు నాలుగు చార్జీషీట్లను సిట్ దాఖలు చేసినా కూడ టాలీవుడ్ సినీ ప్రముఖుల పేర్లు లేవు.

రెండేళ్ల క్రితం టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన కొందరికి డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో సిట్ ప్రత్యేకంగా విచారణ చేసింది.ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొన్న టాలీవుడ్ సీనీ ప్రముఖులను సిట్ ప్రత్యేకంగా విచారించింది.

సిట్ విచారణ చేసిన వారిలో   టాలీవుడ్ నటులు, దర్శకులు కూడ ఉన్నారు.ఈ కేసును సుదీర్థంగా విచారణ చేసిన పోలీసులు ఈ కేసులో నాలుగు చార్జీషీట్లు దాఖలు చేశారు. ఈ నాలుగు చార్జీషీట్లలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లు లేవు. 

సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్టేననే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.ముంబై నుండి రఫెల్ అలెక్స్ అనే వ్యక్తి డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టుగా చార్జీషీట్‌లో సిట్ పేర్కొంది.ఈ కేసులో కొందరు సినీ ప్రముఖుల నుండి సిట్ బృందం  వెంట్రుకలు, చేతి వేళ్ల నమూనాలను కూడ తీసుకొన్నారు.  కానీ, ఈ ప్రముఖులకు  సిట్ క్లీన్ చిట్  ఇచ్చింది.