తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎసిబి అడిషనల్ ఎస్పీ అక్రమ సంబంధం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అవినీతి నిరోధక శాఖలో అడిషనల్ ఎస్పీగా సునీతారెడ్డి పనిచేస్తున్నారు. ఆమె తన సహచర పోలీసు అధికారి సిఐ మల్లిఖార్జున రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ విషయాన్ని సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి స్కెచ్ వేసి రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఒకరోజు అర్ధరాత్రి సునీతారెడ్డి ఇంటికి రావడంతో మాటు వేసి మల్లిఖార్జునరెడ్డిని పట్టుకుని చెప్పులతో చితకబాదారు. సునీతారెడ్డి తల్లి, పెద్దమ్మ కూడా మల్లిఖార్జునరెడ్డిని చెప్పులతో తరిమి కొట్టారు.

ఈ పరిణామం పోలీసు వర్గాల్లో దుమారం రేపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అక్రమ సంబంధం నడుపుతున్న ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే తాజాగా మరో విషయం బయటకొచ్చింది. సునీతారెడ్డి సురేందర్ రెడ్డితో కంటే ముందే లెనిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ పెళ్లి తాలూకు ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. తాజాగా లెనిన్, సునీతారెడ్డి ఇద్దరూ పెళ్లి చేసుకున్న ఫొటోలు బయటపడ్డాయి. ఆర్యసమాజ్ లో వారిద్దరూ పెళ్లి చేసున్నట్లు చెబుతున్నారు. సురేందర్ రెడ్డిని పెళ్లి చేసుకోకముందే సునీతారెడ్డి లెనిన్ ను చేసుకున్నట్లు చెబుతున్నారు.  2002లో ఈ వివాహం జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయితే మొద‌టి పెళ్లైన కొన్ని రోజుల‌కు వారి పెళ్లి పెటాకులైంది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో లెనిన్ పై సునీతారెడ్డి వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు పెట్టినట్లు తెలుస్తోంది. లెనిన్ జైలుపాలయ్యాడు. అనంతరం తనకు మొదటి పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి సురెంద‌ర్ రెడ్డిని రెండ‌వ వివాహాం చేసుకున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం సునీతారెడ్డి, సిఐ మల్లిఖార్జునరెడ్డి ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. వారి విషయంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సునీతారెడ్డి మొదటి పెళ్లి వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది.

మొత్తానికి సునితారెడ్డి ముగ్గురితో వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.