కోదాడ పట్టణంలో సెక్స్ రాకెట్ కలకలం సృష్టించింది. పట్టణ కేంద్రంగా ఆన్‌లైన్‌ వ్యభిచారం కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులో ఈ ముఠా తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 

అందివచ్చిన సాంకేతిక విజ్ఞానాన్ని వీరు తమకు అనుకూలంగా మార్చుకుని యథేచ్ఛగా దందా సాగిస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి  ఈ చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ సెక్స్ రాకెట్ గురించి సమాచారం అందిన దగ్గర నుంచి పోలీసులు నిఘా పెట్టగా.. కొందరు నిందితులను పట్టుకోగలిగారు. కాగా.. ఇప్పుడు నిందితుల వద్ద లభించిన సెల్‌ఫోన్లే ఈ కేసులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దానిలో ఉన్న నంబర్లు, వారితో తరచూ మాట్లాడిన వారి నంబర్లు పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. 

దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేపనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన కొందరు ప్రభ్వుత ఉద్యోగులు, రాజకీయ నేతలు, పత్రికావిలేకరులు, వ్యాపారులు ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. తమ పేరు బయటకు రాకుండా పోలీసులను కాకా పడుతున్నారని, వారిపై పెద్దల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని  ఇక్కడ ప్రచారం సాగుతుంది.