Asianet News TeluguAsianet News Telugu

సమత కేసులో తుది తీర్పు ఈ నెల 30కి వాయిదా

సమత అత్యాచారం, హత్య కేసులో ఆసిఫాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పును మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో తుది తీర్పును కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సమత అత్యాచారం, హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Samatha case judgement postponed for Jan 30
Author
Asifabad, First Published Jan 27, 2020, 10:40 AM IST

ఆసిఫాబాద్: తీవ్ర సంచలనం సృష్టించిన సమత ఆత్యాచారం, హత్య కేసు విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించాల్సి ఉండింది. అయితే, తీర్పును కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. 

సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు డిసెంబర్ 14వ తేదీన ఆసిఫాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 140 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది.. ఈ కేసులో ముగ్గురు నిిందితులను పోలీసులు గుర్తించారు. షేక్ బాబు, షాబుద్దీన్, షేక్ మగ్దుమ్ లను నిందితులుగా చేరుస్తూ వారు ఆ చార్జిషీట్ దాఖలు చేసారు.

Also Read: సమత కేసు: 'ఊహాజనిత ఆధారాలతో చార్ఝీషీట్ దాఖలు' 

సమత కేసులో 44 మంది సాక్షులను పోలీసులు విచారించారు. సమతపై అత్యాచారం చేసి గొంతు కోసి ఆమెను హత్య చేశారని ఫోరెన్సిక్ లాబొరేటరీ పరీక్షల్లో తేలింది. చార్షిషీట్ లో ఫోరెన్నిక్ నివేదికు పొందరు పరిచారు. మృతురాలి చీరపై ఉన్న వీర్యం ఆధారంగా నిందితులను గుర్తించారు. 

నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు సమత కేసును పరిష్కరించడానికి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. ఈ నెల 20వ తేదీన ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తీర్పును ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. మరోసారి తుది తీర్పును కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: సమత రేప్, హత్య కేసులో చార్జిషీట్: చీరపై స్పెర్మ్ ఆధారంగా నిందితుల గుర్తింపు

Follow Us:
Download App:
  • android
  • ios