Asianet News TeluguAsianet News Telugu

రాచకొండలో సేఫ్ గాడీ.కామ్ ను ప్రారంభించిన కమిషనరేట్ (వీడియో)

రాచకొండ కమిషనరేట్ పరిధి లో మొట్టమొదటి సారిగా (సేఫ్ గాడి.కామ్) ఆధ్వర్యంలో మై ఆటో ఇస్ సేఫ్ అనే అనే నూతన కార్యక్రమైవ ఆటో రిజిస్ట్రేషన్ ను  రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఎల్బీనగర్ లోని రాచకొండ సిపి క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రారంభించారు.

రాచకొండ కమిషనరేట్ పరిధి లో మొట్టమొదటి సారిగా (సేఫ్ గాడి.కామ్) ఆధ్వర్యంలో మై ఆటో ఇస్ సేఫ్ అనే అనే నూతన కార్యక్రమైవ ఆటో రిజిస్ట్రేషన్ ను  రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఎల్బీనగర్ లోని రాచకొండ సిపి క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో సొసైటీ ఫర్ సైబరాబాద్  సెక్యురిటి వారి ఆధ్వర్యంలో రాచకొండ లో  22 వేయిల క్యాబ్ లకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, సేఫ్ క్యాబ్ కి ప్రజల నుండి చాలా మంచి స్పందన ఉంది కాబట్టి ఆటో లలో ప్రయాణికులు, మహిళలు చాలా ప్రయాణం చేస్తుంటారు కాబట్టి ఆటో లకి రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేశామని, ప్రయాణికులు ఆటో లో విలువగల వస్తువులను మర్చిపోవడం జరుతుందని, ప్రతి ఆటో సురక్షితంగా ఉందా లేదా అనీ మహిళ ప్రయాణికులకు కొంత అనుమానం ఉంటుంది కాబట్టి  మై క్యాబ్ సేఫ్ మాదిరిగానే మై ఆటో సేఫ్ ఏర్పాటు చేశామన్నారు. ఆటో లో ప్రయాణించే వారు ఆటో లో ఉండే ( క్యూ .ఆర్ కోడ్) తో safe gaadi.com వెబ్ సైట్ తో  ఆటో లైవ్ ట్రాకింగ్ చేయొచ్చు అనీ తెలిపారు. ఎవరైనా ఆటో డ్రైవర్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, ఆటో లో విలువైన వస్తువులు మర్చిపోయిన ప్రయాణికులు కోడ్ సహాయంతో మెసేజ్ పెడితే అది కంట్రోల్ రూమ్ కి వస్తుందని మెసేజ్ రాగానే వాహనం ఎక్కడ నుండి ఎక్కడి కి పోతుంది అనేది పోలీస్ వారు త్వరగ స్పందించడంతోపాటు ఆ అటోను పట్టుకోవడం జరుగుతుందని, సేఫ్ ఆటో ప్రోగ్రాం కచ్చితంగా విజయవంతంగా ముందుకు సాగి ముఖ్యంగా మహిళకు ఉపయోగ పడుతుందన్నారు. ఆటో ప్రయాణికులు మాట్లాడుతూ.. మహిళలకు, చిన్న పిల్లలకు చాలా సురక్షితంగా ఉంటుంది. మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఆటోలో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం అనంతరం అందులో బ్యాగులు తదితర వస్తువులు మర్చిపోతుంటాం. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం వలన మనం ఎక్కిన ఆటో ఎక్కడెక్కడ వెళ్లిందో తెలుసుకుని మన వస్తువులు తీసుకోవచ్చని అన్నారు. 

 అనంతరం రాచకొండ కమిషనరేట్ పరిధి లోని పోలీసులతో నూతన సంవత్సర వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. 2018 లో రాచకొండ కమిషనరేట్ కి అందరూ మంచి పేరు తీసుకొచ్చారని అదే విధంగా 2019 లో కూడా కష్ట పడి పని చేసి మంచి పేరు తీసుకరావాలని కోరారు. వచ్చే గ్రామ పంచాయితీ ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉంది పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగే లా చూడాలని, సంక్రాంతి తరువాత కమిషనర్ ఆఫీస్  గచ్చిబౌలి నుండి నెరేడిమేట్ లో నూతన భవనానికి వస్తుందని అన్నారు.

Video Top Stories