జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: చైర్మెన్ పదవి నుండి ఆయన తప్పుకొంటారా?
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ తో సంబంధం ఉన్న ఓ నామినేటేడ్ బోర్డు చైర్మెన్ ను పదవి నుండి తప్పుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం ఆదేశించినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే పార్టీ ఆదేశిస్తే తాను ఈ పదవి నుండి వైదొలుగుతానని ఆయన మీడియాకు చెప్పారు
హైదరాబాద్:Jubilee hills Gang Rape తో సంబంధం ఉన్న ఓ నామినేటేడ్ బోర్డు చైర్మెన్ ను పదవి నుండి తప్పుకోవాలని TRS నాయకత్వం ఆదేశించినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ పదవి నుండి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను ఈ పదవి నుండి తప్పుకొంటానని నామినేటేడ్ బోర్డు చైర్మెన్ చెబుతున్నారు.
Hyderabad జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నామినేటేడ్ పదవి చైర్మెన్ తనయుడు కూడా ఉన్నాడు. నిందితుడుJuvenile Homeలో ఉన్నారు. చైర్మెన్ పదవి నుండి తప్పించడానికి కొన్ని సాంకేతిక అంశాలు కూడా అడ్డు వస్తున్నాయనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ఈ ప్రచారాన్ని బోర్డు చైర్మెన్ కొట్టిపారేస్తున్నారు. పార్టీ ఆదేశాలు ఇస్తే తాను ఈ పదవి నుండి తప్పుకొంటానని కొందరు మీడియా ప్రతినిధులకు ఫోన్ లో బోర్డు చైర్మెన్ చెప్పారు. జూబ్లీహిల్స్ రేప్ ఘటన వ్యవహారం పార్టీకి కూడా నష్టం తెచ్చేదిగా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. బోర్డు చైర్మెన్ కు సన్నిహితంగా ఉన్న మంత్రి కూడా ఈ పదవి నుండి తప్పుకోవాలని చైర్మెన్ కు చెప్పారనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ ప్రచారాన్ని బోర్డు చైర్మెన్ కొట్టిపారేశారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రజా ప్రతినిధుల పిల్లలే నిందితులు కావడం కూడా సంచలనానికి కారణమైంది.
ఈ ఏడాది మే 28వ తేదీన Amnesia Pub లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.
అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.
కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.