Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కేసులోకి పరిటాల ఫ్యామిలీని గుంజిన రేవంత్

  • తెలుగు రాష్ట్రాల్లో మూడు కుటుంబాలే డ్రగ్ మాఫియా నడుపుతున్నాయి
  • కేసిఆర్ ఫ్యామిలీ, తలసాని ఫ్యామిలీ, పరిటాల ఫ్యామిలీ బాధ్యులు
  • ఉద్దేశపూర్వకంగా డ్రగ్ ప్రశ్న అసెంబ్లీలో రాకుండా అడ్డుకున్నారు
Revanth drags parital and talasani families into drug controversy

డ్రగ్స్ కేసులో ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ మరో సంచలన ఆరోపణలకు దిగారు. తెలంగాణ సిఎం కేసిఆర్ కుటుంబం యావత్తు హైదరాబాద్ లో డ్రగ్ వ్యాపారం చేస్తోందని గతంలో రేవంత్ ఆరపణలు చేశారు. తాజాగా మరో రెండు కుటుంబాలను డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నాయని ఆరోపణలు చేశారు రేవంత్.

కేసిఆర్ కుటుంబంతోపాటు హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం కూడా ఉందన్నారు. అంతేకాదు ఎపి మంత్రి పరిటాల సునీత కుటుంబం కూడా హైదరాబాద్ లో డ్రగ్ మాఫియాలో భాగస్వామ్యం అయిందన్నారు.

కేసిఆర్ చుట్టాలు, తలసాని చుట్టాలు, పరిటాల సునీత చుట్టాలు మూడు కుటుంబాలు కలిసి హైదరాబాద్ లో డ్రగ్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఐదారు పబ్ లకే అనుమతిస్తే కేసిఆర్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్ పోలీసు స్టేషన్ల పరిధిలో 59 పబ్ లకు అనుమతించారని చెప్పారు.

ఈ పబ్ లు అన్నీ ఈ మూడు కుటుంబాల వారే నడుపుతున్నారని తెలిపారు. అయితే ఈ అన్ని పబ్ లలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా జరుగుతుందని ఆరోపించారు.

ఇవాళ అసెంబ్లీలో డ్రగ్స్ పై తన ప్రశ్నకు సమాధానం రాకుండా పదకొండున్నర వరకు ఉత్తుత్తి చర్చలు జరిపి డ్రగ్స్ ప్రశ్న రాగానే సభను సోమవారానికి వాయిదా వేసుకుని పారిపోయారని ఆరోపించారు.

కేటిఆర్ మీద తనకు అనుమానం ఉందని తక్షణమే కేటిఆర్ రక్త నమూనాలు, గోర్ల నమూనాలు, వెంట్రుకల నమూనాలు సేకరించి పరీక్షించాలని మరోసారి సవాల్ చేశారు. తాను గతంలో హోమంత్రిని ఈ విషయంలో సవాల్ చేసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు.

ఆరోపణలు చేస్తే కేసులు పెడతామని సిఎం అన్నారు కదా? నేను స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నాను. దమ్ముంటే నామీద కేసులు పెట్టి జైలుకు పంపండి అని సవాల్ చేశారు.

కేటిఆర్ సొంత బామ్మార్ది రాజ్ పాకాల డ్రగ్ మాఫియా కింగ్ గా హైదరాబాద్ లో చెలామణి అవుతున్నాడని ఆరోపించారు. బామ్మార్ది కళ్లల్లో ఆనందం చూసేందుకు బావగా కేటిఆర్ ఎంతకైనా తెగిస్తున్నాడని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios