తెలంగాణ సిఎం కేసిఆర్ జాతీయ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చర్చను లేవనెత్తారు. అదే కాంగ్రెస్, బిజెపి యేతర కొత్త ఫ్రంట్ పై కేసిఆర్ గత రెండు రోజులుగా కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ ప్రకటించిన ఫ్రంట్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ అయింది. కాంగ్రెస్ లో కొత్తగా చేరిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కేసిఆర్ కొత్త ఫ్రంట్ పై కామెంట్స్ చేశారు. కేసిఆర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష పెడతామని అందులో నెగ్గాలని సవాల్ విసిరారు. వనపర్తి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మల్యే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సింహగర్జన సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రేవంత్ కొత్త ఫ్రంట్ పై ఇంకేం మాట్లాడారో వీడియోలో చూడండి.