రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపడడంలో వైఫల్యం, హోం మంత్రి తప్పుకోవాలి: రేణుకా చౌదరి డిమాండ్

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి విమర్శించారు. ఇవాళ హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
 

Renuka chowdhury Fires On TRS government Over Serial rape incidents in Hyderabad

హైదరాబాద్: హోంమంత్రి మహమూద్ అలీ తన పదవి నుండి తప్పుకోవాలని  మాజీ కేంద్రమంత్రి Renuka chowdhury డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయన్నారు.శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.  

మంగళవారం నాడు Congress పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి Hyderabad గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. Jubilee hills gang rape  ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె తప్పు బట్టారు. మహమూద్ అలీ ఈ పదవిలో ఉండగా  కేసు విచారణ నిష్పక్షికంగా జరుగుతుందని ఎలా చెప్పగలమని ఆమె ప్రశ్నించారు. 

 ఇన్నోవాలో ఎంతమంది ఉన్నారు. ఈ కారును ఎవరు నడిపారని ఆమె ప్రశ్నించారు. ఒక్కరోజే ముగ్గురు మైనర్లపై అత్యాచారాలు జరిగాయని రేణుకా చౌదరి చెప్పారు. అమ్మాయిలు ఇంటినుండి బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి వచ్చే రోజులు పోయాయన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. 

హైద్రాబాద్ లో ఎన్ని షీ టీమ్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నాయని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర లేవాలని రేణుకాచౌదరి కోరారు.  రాష్ట్రంలో క్రైమ్ రేట్  విపరీతంగా పెరిగిందన్నారు.  అన్ని వ్యవస్థలు ఉండి కూడా అమ్మాయిలకు రక్షణ కల్పించకపోతే ఎలా అని రేణుకా చౌదరి ప్రశ్నించారు.బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేయడం సరైందేనన్నారరు. మైనర్ బాలిక ఫోటోను మీడియా సమావేశంలో విడుదల చేయడం సరైంది కాదన్నారు.

also read:జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి నోటీసులివ్వనున్న పోలీసులు

ఇన్నోవా కారు వీడియోలన రఘునందన్ రావు ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ కేసులో కాంగ్రెస్ నేతల పిల్లలుంటే రఘునందన్ రావు బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రేప్ లు పెరగడమేనా బంగారు తెలంగాణ అంటే అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణలో చిన్నారులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios