హైదరాబాద్:సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ పాతబస్తీలో చోటు చేసుకొంది.

Also read:దారుణం: కారులోనే వివాహితపై అత్యాచారం

హైద్రాబాద్ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతానికి చెందిన యువతికి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన మహ్మద్ అడ్నాన్ అహ్మద్ తో 2015 లో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొంటానని ఆ యువతిని నమ్మించాడు ఆ యువకుడు.

ఈ క్రమంలోనే ఆ యువకుడు కర్ణాటక నుండి బండ్లగూడకు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే  ఆ తర్వాత పెళ్లి గురించి ఆ యువకుడి నుండి ఎలాంటి స్పందన లేదు.

రోజులు గడుస్తున్న కొద్ది అతనిలో మార్పులు కన్పించాయి. దీంతో అనుమానం వచ్చిన యువతి అతడిని నిలదీసింది. విధి నిర్వహణలో బిజీగా ఉన్నట్టుగా చెప్పి తప్పించుకొన్నాడు.

అనుమానం వచ్చిన యువతి గుల్బర్గాకు వెళ్లి విచారించింది. వేరే యువతితో అతడికి నిశ్చితార్థం జరిగినట్టుగా తేలింది. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.