Asianet News Telugu

ముంబై యువతిపై హైద్రాబాద్‌లో అత్యాచారయత్నం : నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్

ముంబై నుండి వచ్చిన యువతిపై హైద్రాబాద్ నగరంలోని ఓ హోటల్ లో ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

rape attempt on mumbai woman in Hyderabad, complaints to police lns
Author
Hyderabad, First Published Oct 13, 2020, 4:34 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


హైదరాబాద్: ముంబై నుండి వచ్చిన యువతిపై హైద్రాబాద్ నగరంలోని ఓ హోటల్ లో ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ముంబైకి చెందిన ఓ యువతి హైద్రాబాద్ కు వచ్చింది. అయితే హైద్రాబాద్ లో ఓ వ్యక్తి ఆమెపై మద్యం మత్తులో అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తికి ఇద్దరు యువతులు సహకరించారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసును మంబై పోలీసులు హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేశారు.  హోటల్ లో బర్త్ డే పార్టీకి హాజరైన ముంబై యువతిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. అంతేకాదు బాధిత యువతిని నగ్నంగా వీడియోలు తీశారు. అంతేకాదు దీంతో వీటితో ఆమెపై బెదిరింపులకు దిగారు.

హైద్రాబాద్ నుండి ముంబైకి వెళ్లిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదును ముంబై పోలీసులు విచారణ చేయాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios