హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు ఓడిశాకు చెందిన యువకులకు  రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

గత ఏడాది మహేశ్వరంలో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.ఒడిశా రాష్ట్రంలోని బలంగీర్ జిల్లాకు చెందిన వివాహిత భర్త, కొడుకుతో కలిసి ఉపాధి కోసం హైద్రాబాద్ వలస వచ్చింది.

మహేశ్వరంలోని ఇటుకలబట్టీలో దంపతులు పనిచేస్తున్నారు. అయితే ఒడిశాకు చెందిన నలుగురు యువకులు అక్కడే పనిచేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆమెపై ఈ నలుగురు కామాంధులు కన్నేశారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో నలుగురు ఆమెపై 2019 ఆగష్టు మాసంలో  అత్యాచారానికి పాల్పడ్డారు. 

రాహుల్ , మనోజ్, దుర్గా, దయాలు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు కోర్టులో వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను అందించారు.ఈ కేసులో  నిందితులకు రంగారెడ్డి కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ సోమవారం నాడు తీర్పు చెప్పింది.