తెలంగాణకు చెందిన ముఖ్యమైన 38 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీతో సోమవారం నాడు భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. నేతల మధ్య విబేధాల గురించి కూడా చర్చించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎసంతో తమకు ఎలాంటి పొత్తులుండవని కాంగ్రెస్ నేతలు స్పస్టం చేశారు. తమ మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను కూడా పరిష్కరించుకొన్నామన్నారు. రానున్న రోజుల్లో సంఘటితంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.
Telangana కాంగ్రెస్ నేతలు సోమవారం నాడు AICC మాజీ చీఫ్ Rahul Ganhdi తో సుమారు మూడు గంటలకు పైగా చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత టీపీసీసీ చీఫ్ Revanth Reddy మీడియాతో మాట్లాడారు. రాస్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించామని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ మధ్య ఉన్న బిన్నాభిప్రాయాలను కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామన్నారు.కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తామంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని రాహుల్ గాంధీ తమకు సూచించారని రేవంత్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న TRS ను గద్దె దించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. మతం ముసుగులో లేదా సమస్యలను జఠిలం చేయడం ద్వారానో రాజకీయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీని తెలంగాణ పొలిమేరల్లోనే నిలిపివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్, BJP లు వ్యూహత్మకంగా పనిచేస్తూ తెలంగాణ సమాజంలో స్పష్టమైన విభజనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సమాజంలో చీలిక తెచ్చే ప్రయత్నాన్ని వమ్ము చేసేందుకు కాంగ్రెస్ తమ వంతు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుందన్నారు.తమకు రాహుల్ గాంధీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. తెలంగాణలోని ప్రతి గడపకు వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తామన్నారు.
మాజీ టీపీసీసీ చీప్ Uttam Kumar Reddy మాట్లాడుతూ 38 మంది తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. తమ మధ్య ఉన్న విబేధాలపై కూడా ఈ సమావేశలో చర్చించామన్నారు. ఇప్పటి నుండి నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసకున్నామన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం తో ఎలాంటి పొత్తులుండవన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రకటన ఆరు మాసాల ముందే ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తమ సమావేశంలో ఈ విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పారన్నారు.నేతలంతా ఐక్యంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.సీఎల్పీ నేత Mallu Bhatti Vikra Markaమాట్లాడుతూ నేతలంతా సంఘటితంగా పని చేసి పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించేందుకు కూడా అంగీకరిచారన్నారు.
