Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్: మైనర్ బాలికతో హైటెక్ వ్యభిచారం... ఇద్దరు మహిళలతో కూడిన ముఠా అరెస్ట్

17ఏళ్ల మైనర్ బాలికను వ్యభిచార కూపంలోకి లాగి గలీజ్ దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. 

Rachakonda police busted a prostitution racket at Hyadrabad
Author
Hyderabad, First Published Oct 12, 2021, 10:55 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: ఓ మైనర్ బాలికను వ్యభిచార రొంపిలోకి దించి గలీజ్ దందా చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గుట్టుగా వ్యభిచార దందా సాగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో రాచకొండ కమీషనరేట్ లోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఓ ఇంటిపై దాడి చేసారు. ఓ మైనర్ బాలికతో పాటు ఓ విటుడు, ముగ్గురు నిర్వహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ బాలాపూర్ లోని రాయల్ కాలనీలో రెహానా బేగం, సల్మా, సయ్యద్ అబుబకర్ brothel house నిర్వహిస్తున్నారు. hyderabadలోని అమ్మాయిలనే కాదు ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది ఈ ముఠా. ఇటీవల బిహార్ కు చెందిన 17ఏళ్ల మైనర్ బాలికను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది. మైనర్ బాలికను చూపి వివిధ మాధ్యమాల ద్వారా యువకులను ఆకర్షిస్తూ గలీజ్ దందా జోరుగా సాగిస్తోంది ఈ ముఠా. 

read more  వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసి అన్నాదమ్ములు లైంగిక దాడి...

అయితే గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్నా నిత్యం ఆ ఇంటికి కొత్తవారు ఎక్కువగా వస్తుండటంతో కాలనీవాసులకు అనుమానం వచ్చింది. దీంతో కొందరు పోలీసులకు సమాచారం అందించగా రాచకొండ కమీషనరేట్ లోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అప్రమత్తమైంది. ఆ ఇంటిపై నిఘా వుంచి వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. ఆ ఇంటిపై దాడిచేసి ముగ్గురు నిర్వహకులతో పాటు మైనర్ బాలికను, 20ఏళ్ల విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుండి రూ.2,420 నగదు, 3సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. 

మైనర్ బాలికను బాలాపూర్ పోలీసుల ప్రశ్నించగా... తనను బిహార్ నుండి తీసుకువచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిపింది. పదో తరగతి వరకు చదువుకున్న తనను కొందరు ఏజెంట్లు ఈ రొంపిలోకి లాగారని తెలిపింది. యువతిని రిహాబిటేషన్ సెంటర్ కు తరలించిన పోలీసులు మిగతావారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios