తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపిల మధ్య ప్రోటోకాల్ వార్ కొనసాగుతూనే ఉంది. మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టిఆర్ఎస్  ప్రభుత్వాన్ని నిలదీశారు.తాజాగా ఇప్పుడు మంత్రి తలసానికి ఆ వంతు వచ్చింది.  తనను బిజెపి నేతలు, కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన వాపోయారు. 

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న రైల్వే ఆధునీకరణ పనులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరవుతున్నా.... ఆ కార్యక్రమానికి  సంబంధించి ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని మంత్రి తలసాని వ్యాఖ్యలు చేశారు.

Also Read:మెట్రోపై కిషన్ రెడ్డి సమీక్ష:ప్రోటోకాల్ అంశం లేవనెత్తిన బీజేపీ

ఈ విషయంపై తలసాని ట్విట్టర్లో  తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బిజెపి నేతలు అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహారించడం నేర్చుకోవాలన్నారు.  

ఎంజీబీఎస్- జేబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డికి మెట్రో అధికారులు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదన్న కారణంగా మెట్రో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:ఎర్రబస్సు తప్ప ఏం తెలియదు: తెలుగు ప్రజలపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని వ్యాఖ్యలు చేశారు. అనంతరం మెట్రో రైలు ప్రయాణం చేసిన కిషన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా మెట్రో ప్రారంభోత్సవాన్ని నిర్వహించారని మరోసారి అధికారులపై తన అక్కసును వెళ్లగక్కారు.

ఇదే సమయంలో ఆ వెంటనే జరుగుతున్న మరో కార్యక్రమానికి మంత్రి తలసానికి ఇదే పరిస్థితి ఎదురైంది. బోయగూడాలో చేపడుతున్న రైల్వే అభివృద్ధి పనులకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు ఆహ్వానం ఇవ్వక పోవడాన్ని ఏమంటారు అంటూ కిషన్ రెడ్డిని తలసాని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల విషయంలో హుందాగా వ్యవహరించడం బీజేపీ నేతలు నేర్చుకోవాలని హితవు చెప్పారు.