హైదరాబాద్ లో స్పాల ముసుగులో వ్యభిచారం.. మూడు కేంద్రాలపై కేసులు...

స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్ల మీద పోలీసులు తనిఖీలు చేశారు. మూడు కేంద్రాలపై కేసులు నమోదు చేశారు. 

prostitution racket running under spa busted police, hyderabad

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఫిలింనగర్లో నిబంధనలకు విరుద్ధంగా స్పాల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు సెంటర్లపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లోని మోరా థాయ్ స్పాతో పాటూ ఫిలింనగర్లోని మరో రెండు స్పాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే మోరా థాయ్ స్పా మేనేజర్ పై కేసు నమోదు చేశారు.

ఈ స్పా యజమాని విశాల్ బాయ్ గజేరా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు భాగస్వాములు కార్తీక్,  అలీ ఖాన్ లు కూడా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే   ఫిలింనగర్ లోని మరో రెండు స్పాలపై కూడా దాడులు జరిగాయి. ఇక్కడ కూడా నిబంధనలు  ఉల్లంఘించి స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఫిలింనగర్లోని స్పాలలో గత ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నట్లు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో వెల్లడైంది. 

అయితే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వల్లనే నిర్వాహకులు స్పా కేంద్రాలను వ్యభిచార గృహాలుగా మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ సెక్టార్ పరిధిలోని స్పాలు అన్నీ వ్యభిచార ముఠాలుగా మారాయని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇక్కడి స్పాల వ్యవహారాలపై పోలీసుల విచారణకు ఆదేశించారు. 

విషాదం.. బాత్రూంలో గీజర్ పేలి నవ దంపతులు మృతి...

ఇదిలా ఉండగా, ఏపీలోనూ అక్టోబర్ 16న ఇలాంటివే బయటపడ్డాయి. విజయవాడ నగరంలోని కొన్ని స్పాలు, మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఏకకాలంలో పలు స్పా, మసాజ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 19 కేంద్రాలను సీజ్ చేశారు. ఈ వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ విశాల్ గున్ని వెల్లడించారు. విజయవాడలో  200కు పైగా స్పా,  మసాజ్ సెంటర్లు ఉన్నాయని  డీసీపీ తెలిపారు.

కొన్ని స్పా, మసాజ్, ఫిట్నెస్, వెల్ నెస్, స్లిమ్మింగ్, హెల్త్ సెంటర్లలో  హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.  ఆయా సెంటర్లపై వారంరోజులుగా నిఘా పెట్టామని అన్నారు. ఈ సెంటర్లలో 20 ప్రత్యేక పోలీసు బృందాలతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా, 19 కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. దివ్య యూనిసెక్స్ యూటీ సెలూన్, గోల్డెన్ కోక్స్, నోవా వెల్ నెస్ ఫిట్ నెస్  సెంటర్లలో వ్యభిచారానికి సంబంధించిన కొన్ని వస్తువులు లభించినట్లు డీసీపీ తెలిపారు.  

పూర్తిస్థాయి విచారణ తర్వాత 19 కేంద్రాలను సీజ్ చేశామని, అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న 18 మంది ఇతర రాష్ట్రాలు, దేశాల  యువతులను,  ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని   వివరించారు. వారితో పాటు ఆరు కేంద్రాల నిర్వాహకులపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అందరినీ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. టాస్క్ ఫోర్స్ ఏడిసిపి కె. శ్రీనివాసరావు, ఏసీపీ ఖాదర్ బాషా పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios